కరీంనగర్/గన్నేరువరం ఏప్రిల్ 14 (జాగో న్యూస్): గన్నేరువరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు మండల కేంద్రం తోపాటు అన్ని గ్రామాలలో ఘనంగా ఆదివారం నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. గునుకుల కొండాపూర్ లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాలలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత గొప్పతనాన్ని కొనియాడారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను స్మరించుకొని బాబా సాహెబ్ ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు
