అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలు

కరీంనగర్/తిమ్మాపూర్, ఏప్రిల్ 14 (జాగో న్యూస్): భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 133వ జయంతి వేడుకలు పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మహనీయులు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం AIAYS మండల అధ్యక్షులు పారునంది జలపతి మాట్లాడుతూ సమాజంలో అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, దళితులు,బహుజనులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడని, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహనీయుదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల సీనియర్ నాయకులు బోయిని కొమురయ్య,మాతంగి లక్ష్మణ్, కనుకం రాములు,మేడి అంజయ్య,మీసాల అంజయ్య, ఎల్కపెల్లి సంపత్, కన్నం నర్సయ్య, అలువాల శంకర్,బొర్రా రావన్న, కవ్వంపల్లి పద్మ,కన్నం లక్ష్మణ్,మల్లేష్,గూడ కమలాకర్, మామిడి విద్య సాగర్, అనిల్, రెడ్డిగణి రాజు, కోయాడ మురళి, రాచమల్ల ప్రసాద్,బొయిని తిరుపతి, బోయిని సంపత్,అలువాల సంపత్, తాటిపెల్లి సంపత్,అసంపెల్లి అశోక్,గాజా సాగర్,కళ్లెం బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు