కరీంనగర్, ఏప్రిల్ 18 (జాగో న్యూస్): రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ను బీజేపీ వాళ్లు బతకనిస్తారా?” అని ప్రశ్నించాడు. కాంగ్రెస్‌కు అధికారం వచ్చింది కదా అని బీఆర్ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లోకి వెళ్తే ఇక్కడ అంతా బీజేపీ కథ నడుస్తుందని నాతో ఆ నాయకుడు వాపోయాడు. ఇప్పటికిప్పుడు 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సార్ అని నన్ను సంప్రదించాడు, కానీ ఇప్పుడే వద్దని నేనే చెప్పా అని బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు.









