ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీల నిర్వహించడంలో అధికారుల విఫలం. * డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి.

కరీంనగర్, ఏప్రిల్ 18 (జాగో న్యూస్): ప్రైవేట్ ఆస్పత్రిలో గర్భిణీ స్త్రీలు పేద రోగులు వివిధ రోగాలతో ప్రైవేట్ హాస్పటలకు ఆశ్రయిస్తే సకాలంలో వైద్యులు వైద్యం అందించకపోవడం వల్ల రోగులు చనిపోతున్నా వైద్య అధికారులు పట్టించుకోవడంలేదని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి ఆరోపించారు. స్థానిక జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరేష్ పటేల్ అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నర్సింగ్ హోమ్, మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ సంతాన సౌపల్య కేంద్రాలు లాంటి రకరకాల పేర్లు పెట్టి అర్హులైన వైద్యులు లేకుండా వారి యొక్క పట్టికలో అర్హులైన వైద్యులు ఉన్నారని చూపిస్తూ రోగులను ఆర్థిక దోపిడీ చేస్తున్నారని ఆయన అన్నారు. పార్కింగ్ స్థలాలు ఫైర్ సేఫ్టీ, హాస్పటల్ అనుమతులు అర్హులైన వైద్యులు లేకున్నా హాస్పటల్ నడుపుతున్నారని అధికారులకు దృష్టికి తీసుకుపోయిన నేటి వరకు ఆస్పత్రిలు తనిఖీ నిర్వహించకపోవడం వల్ల ప్రైవేట్ ఆస్పత్రిలో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి సకాలంలో వైద్యం అందక రోగులు చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నిన్న చూసినట్టయితే లతా నర్సింగ్ హోమ్ లో శిరీష అనే గర్భిణీ స్త్రీ గత పది రోజుల క్రితం ఆస్పత్రికి వస్తే ఆస్పత్రిలో శిశువును జన్మించిన అనంతరం వైద్యురాలు పరిస్థితి విషమంగా ఉందని ఆదర్శ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తే అక్కడ వారం రోజులు వైద్యం తీసుకున్న అనంతరం బాలింత మహిళ చనిపోయిందని బంధువులు లతా నర్సింగ్ హోమ్ ముందు ఆందోళనలు నిర్వహిస్తే గుట్టు చప్పుడు కాకుండా చనిపోయిన మహిళా బంధువులకు డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేస్తున్న పరిస్థితి జిల్లా కేంద్రం నేలకొల్పిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితులు రావద్దంటే ముందస్తుగా వైద్యాధికారులు ఒక తనిఖీ బృందా నిర్వహించి నిజనిర్ధరణ కమిటీ పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావని ఆయన అన్నారు. ఇప్పటికే పట్టణంలో విచ్చలవిడిగా అర్హులు లేని వైద్యులు ప్రైవేట్ హాస్పిటల్లో నెలకొల్పి వైద్యాన్ని వ్యాపారంగా నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా లత నర్సింగ్ హోమ్ ఆదర్శ హాస్పిటల్ లో చనిపోయిన బాలింత మహిళ ఎలా చనిపోయిందో న్యాయవిచరణ జరిపి ఇటువంటి సంఘటనలు పునరుద్ధం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా అధికారులను కోరారు. జిల్లా వైద్యాధికారులు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో కుమ్ముకై చర్యలు తీసుకోవడం లేదని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జిలకపతి నాయక్ భాస్కర్ జిల్లా నాయకులు నవీన్ అజయ్ రఘుపతి రాజు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు