కరీంనగర్, ఏప్రిల్ 29 (జాగో న్యూస్): కొత్తపల్లి మండలం చింతకుంట ఎల్లమ్మ గుడి వద్ద సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో కొత్తపెళ్లి మండల అధ్యక్షుని కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా పెరుమండ్ల ఆంజనేయులు గౌడ్, ఉపాధ్యక్షులుగా ఆరె పరుశురాం గౌడ్, బొమ్మ తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శిగా తీగల రాజు గౌడ్, కార్యవర్గ సభ్యులుగా కాసారపు శ్రీనివాస్ గౌడ్ పురుషోత్తం శ్రీనివాస్ గౌడ్ దుర్గం మల్లేశం గౌడ్, బుర్ర శంకర్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల కమిటీని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల హక్కుల కోసం నిరంతరం ఈ కమిటీ పని చేయాలని రాబోయే కాలంలో గీత కార్మికులకు రావలసిన సంక్షేమ పథకాలు ప్రతి గీత కుటుంబానికి అందే విధంగా కృషి చేయాలని ఆయన తెలిపారు. బాధ్యతతో గీత కార్మికుల సమస్యల పరిష్కారం చేసే విధంగా ముందుకు సాగాలన్నారు. ప్రతి గ్రామంలో ఈతవనం పెంచుకొనుటకై ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంజాల స్వామి గౌడ్, పెరమండ్ల వేణుగోపాల్ గౌడ్ ఇతర గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.









