కరీంనగర్/గన్నేరువరం, మే 21 (జాగో న్యూస్): గన్నేరువరం మండలం మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ట్రాక్టర్ యూనియన్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కూన సంతోష్ ,ఉపాధ్యక్షులు కళ్లెం లక్ష్మణ్ ,బుర్ర మల్లేష్ గౌడ్ ,ప్రధాన కార్యదర్శి బత్తిని రాజశేఖర్ ,కార్యదర్శి బత్తిని రవీందర్, క్యాషియర్ రాపోలు వెంకటేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కూన సంతోష్ మాట్లాడుతూ. యూనియన్ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. తన నియమాకానికి సహకరించిన యూనియన్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.









