కరీంనగర్/గన్నేరువరం, మే 21 (జాగో న్యూస్): గన్నేరువరం మండలంలోని కాసింపేట మానసా దేవి ఆలయ షష్టమ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం మానసా దేవిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గునుకుల కొండాపూర్ లో జరుగుతున్న రేణుక ఎల్లమ్మ జాతరలో పాల్గొని గ్రామ దేవత పోచమ్మ తల్లిని, ఎల్లమ్మ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మానసా దేవి ఆలయ కమిటీ సభ్యులు, రేణుక ఎల్లమ్మ జాతర కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. శాలువాతో ఘనంగా సన్మానించారు. వీరి వెంట యువజన కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, నాయకులు బద్దం సంపత్ రెడ్డి, పరిపూర్ణాచారి, గౌడ సంఘం నాయకులు నేలపట్ల పరశురామ్ గౌడ్, తాళ్ల పెళ్లి రాజయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి జ్యోతి, బే తల్లి సమత, రాజేందర్ రెడ్డి, బాలరాజు, నేలపట్ల కనకయ్య, సుధ గోని మల్లేశం గౌడ్, తాళ్ల పెళ్లి శ్రీనివాస్ గౌడ్, హనుమండ్ల నరసయ్య, నాగపురి శంకర్ , దొమ్మటి మల్లయ్య, రవి గౌడ్, హరీష్, రాజు అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.









