కరీంనగర్, మే 29 (జాగో న్యూస్): జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో రెండు రోజుల శిక్షణలో భాగంగా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి వెంకటేష్ ఆధ్వర్యంలో 9 మంది శిక్షణ న్యాయమూర్తులు పట్టణంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమము మరియు స్వాదార్ హోం ని సందర్శించారు. వృద్ధాశ్రమంలో అందుతున్న సేవలు గురించి తెలుసుకున్నారు. అలాగే స్వాదార్ హోమ్ లో ఉన్న బాధితులతో ముచ్చటించి వారి యొక్క సమస్యలను తెలుసుకున్నారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్ మరియు వృద్ధాశ్రమము, స్వాధర్ హోం సిబ్బంది పాల్గొన్నారు.









