కరీంనగర్, జూన్ 2 (జాగో న్యూస్): కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని ఎస్సారెస్పీ అధికారులను జిల్లా కలెక్టర్ ని బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ కోరారు. రైతులు పొలాలు దున్నుకొని నారు పోసుకునే సమయం వచ్చిందని ఇప్పటివరకు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయలేదు కెనాల్ పై ఆధారపడుతున్న రైతులు చాలామంది ఉన్నారని అన్నారు. ఇప్పటివరకు నీటిని విడుదల చేయలేదు పెద్ద కెనాల్ నుండి చిన్నచిన్న కెనాల్సు ద్వారా రైతులకు నీరు అందించాలి నీరు అందించినట్టయితే పొలాలు దున్నుకొని నార్లు పోసుకొని రైతులు వ్యవసాయం చేసుకొని జీవిస్తుంటారు. కానీ ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం అసలు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేయకపోవడం చాలా బాధాకరం వెంటనే కెనాల్ ల ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నారు. వ్యవసాయం చేసుకొని బ్రతకాలా కూలి పని చేసుకుని బ్రతకాలని రైతులు అయోమయానికి గురవుతున్నారని వెంటనే ప్రతి కెనాల్ నుండి నీటిని విడుదల చేయాలని కోరుతున్నాము. చేయని వెడల రైతుల పక్షాన అన్ని పార్టీలను కలుపుకొని రైతులకు మద్దతుగా నిలబడి నీరు వచ్చేవరకు పోరాటం చేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బోయిని హరీష్ బూట్ల సంపత్ తదితరులు పాల్గొన్నారు.









