కరీంనగర్, జూన్ 2 (జాగో న్యూస్): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల పాటు కొనసాగిన పోరాటంలో ఎంతోమంది ఆత్మ బలిదానం చేసుకున్నారని, దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ రాష్ట్ర ఏర్పాటు విషయంలో నాన్చుడు ధోరణి అవలంబించిందని, దాదాపు 1200 మంది బలిదానం అయితే తప్ప రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ముందడుగు వేయలేదని , రాష్ట్రం జరిగిన బలిదానాల పాపం కాంగ్రెస్ దేనని, బిజెపి మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. వేడుకలను పురస్కరించుకొని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి , బిజెపి శ్రేణులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పించి, ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అమరవీరుల త్యాగాల మీద ఏర్పడిందన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని మరువలేమన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత్రి సో
నియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందనే కాంగ్రెస్ వాదుల తీరుపై ఆయన మండిపడ్డారు. సోనియా గాంధీ ఏ హోదాలో తెలంగాణ ఇచ్చింది.? దేశ ప్రధాని, లోక్ సభ ఆమోదంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే,సోనియా గాంధీ ఎలా ఇచ్చినట్టువుతుందని ప్రశ్నించారు. నాడు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇచ్చే అవకాశం ఉన్న కూడా దాటవేత ధోరణి ని అవలంబించిందని, తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా అడ్డుకొని 1200 మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణమైందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1200 మంది ప్రాణాలు పోయేదాక చూసిన సోనియా దేవత ఎట్లా అవుతుందో సమాధానం చెప్పాలన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం , నేటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదని , తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు, ఆశయాలు నెరవేర్చడం బిజెపితోనే సాధ్యమన్నారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర , జిల్లా నాయకులు బాస సత్యనారాయణ రావు, మేకల ప్రభాకర్ యాదవ్ , తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బత్తుల లక్ష్మీనారాయణ దండు కొమురయ్య మలుగూరు సమ్మిరెడ్డి కన్న కృష్ణ, కటకం లోకేష్, దుబ్బాల శీను పుప్పాల రఘు, కార్పొరేటర్లు కోలగని శ్రీనివాస్, దుర్శేట్టి అనుప్, పవన్, జితేందర్ బండ రమణారెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, రాగి సత్యనారాయణ, శ్రీనివాస్, సుధాకర్, బండారు గాయత్రి, రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.









