కరీంనగర్,తిమ్మాపూర్, జూన్ 2 (జాగో న్యూస్): తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నం అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద జెండా ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఎంతోమంది విద్యార్థుల అమరుల త్యాగాలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని దానిని కేసీఆర్ 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని వందేళ్ల అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రాష్ట్రాలన్నింటిలో ఉన్నత స్థానంలో నిలిపిన ఘనత కెసిఆర్ దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పుప్పాల కనకయ్య, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, యూత్, విద్యార్ధి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









