పది సంవత్సరాల పాలనలో బిజెపి బీసీలకు చేసింది ఏమిటో చెప్పాలి. * పొన్నం కృషితోనే కుల జన గననకు పునాది. * జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్

కరీంనగర్, జూలై 23 (జాగో న్యూస్): బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ గారు డిసిసి కార్యాలయంలో పలువురు నేతలతో కలిసి పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పులి ఆంజనేయులు గౌడ్ గారు మాట్లాడుతూ…రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే బీసీ కుల జన గణ నకు అసెంబ్లీలో ఆమోదం తెలిపిన కాంగ్రెస్ ను విమర్శించే స్థాయి గంగాడికి లేదన్నారు.

* కేంద్రమంత్రిగా బీసీల కోసం బండి సంజయ్ చేసిందేమిటో చెప్పాలి

బిజెపి 10 సంవత్సరాల పాలనలో మొదటి వరకు రాష్ట్ర బిజెపి అధ్యక్షునిగా నేడు కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ వల్ల బీసీలకు ఒరిగిందేమిటో గంగాడి కృష్ణారెడ్డి స్పష్టం చేయాలి. నిన్న మొన్నటి వరకు గంగాడి కృష్ణారెడ్డి ముఖం ఎవరికి తెలియదు.. తన అధ్యక్ష పదవిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ ఉనికిని చాటుకోవాలనుకుంటున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి కృషితో వంద రోజుల్లోనే రాష్ట్రంలో బీసీ కులజన గణనకు అసెంబ్లీ సాక్షిగా ఆమోదం తెలుపడం గొప్ప విషయం కాదా అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన న్యాయంపై బిజెపి 10 సంవత్సరాల పాలనలో చేసిన న్యాయం పై శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధం.. మీరు సిద్ధమా.. ఇందిరా చౌక్ వేదికగా తేల్చుకుందాం రండి. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నప్పటికీ నేడు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో బీసీలకు బడ్జెట్ కేత్రాయించకపోవడం పట్ల బిజెపి నేతలు సిగ్గుపడాలి. బిజెపి పాలిత రాష్ట్రాలలో కుల జన గణన ఎందుకు చేపట్టలేదో వివరణ ఇవ్వాలి. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రామిడి రాజి రెడ్డి, లింగంపల్లి బాబు, నూనె గోపాల్ రెడ్డి, ఎస్.కే.సిరాజ్ హుస్సేన్, పోతుగంటి శ్రీనివాస్, మొలుగూరి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు