రాజన్న సిరిసిల్ల/తంగాలపల్లి మార్చి 02 (జాగో న్యూస్): తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ గుడి ఆలయానికి భూమి పూజ చేసిన గ్రామస్తులు, నాయకులు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ జిల్లాలోనే మండేపల్లి గ్రామం ఎంతో ప్రత్యేకత అన్నారు, ఇక్కడ ఎల్లమ్మ జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు, ఈ గంగమ్మ జాతరను కూడా అలాగే జరిగేలా చూడాలన్నారు, సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, అలాగే ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి కి ఈ ఆలయం గురించి దృష్టికి తీసుకువెళ్లి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా ఐదు లక్షల రూపాయలు వచ్చేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ బండి దేవాదస్, ఎ ఎం సి వైస్ చైర్మన్ నేరళ్ల నరసింహం గౌడ్,కాంగ్రెస్ నాయకులు పూర్మాని లింగారెడ్డి,జిల్ల కాంగ్రెస్ ఫిషరీస్ ప్రధాన కార్యదర్శి చెన్నమనేని ప్రశాంత్,పద్మనాగర్ మాజీ సర్పంచ్ మూడరీ పోచయ్య,గ్రామస్తులు పాల్గొన్నారు.









