కరీంనగర్, మార్చి 02 (జాగో న్యూస్): కరీంనగర్ నగరపాలక సంస్థ 9వ డివిజన్ బిజెపి నాయకులు , కాంటెస్టెడ్ కార్పొరేటర్ మాసం గణేష్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున స్నేహపూర్వక క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ లు నిర్వహించారు. నాలుగు జట్ల కోతిరాంపూర్ యూత్ తో క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ లు జరిగాయి. ఇట్టి క్రికెట్ టోర్నమెంట్లో భిక్షు టీం విజేతగా నిలువగా, రాఖీ 11 టీం రన్నరప్ గా నిలిచింది. అనంతరం విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి వాణిజ్య సేల్ కన్వీనర్ పసుపులేటి శివానందం తదితరులు పాల్గొన్నారు.









