తిమ్మాపూర్ లో బీజేపీ సంబరాలు…

కరీంనగర్/తిమ్మాపూర్, మార్చి 04 (జాగో న్యూస్): ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా మల్క కొమురయ్య గెలుపొందిన సందర్బంగా మంగళవారం తిమ్మాపూర్ బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. తిమ్మాపూర్ కేంద్రం నుండి సుమారు 100 బైక్ లతో ర్యాలీ బయలుదేరిన బీజేపీ కార్యకర్తలు అల్గునూర్ లో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మండలం అధ్యక్షులు సుగుర్తి జగదీశ్వరాచారి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాడేది బీజేపీ యే అని గుర్తించిన ఉపాధ్యాయులు తపస్ బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య ను మొదటి ప్రాదాన్యత ఓటుతో గెలిపించి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు తెలిసేలా చేశారని అన్నారు. 317 జివో రద్దు కోసం బీజేపీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో బండి సంజయ్ చేసిన నిరసన దీక్ష తో నాటి బిఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని పేర్కొన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందని త్వరలో మూల్యం చెల్లించుకుంటుందని అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్ చంద్ర,జిల్లా కార్యవర్గ సభ్యులు బూట్ల శ్రీనివాస్, చింతం శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల తిరుపతి రెడ్డి, బిజేవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్,దళిత మోర్చా అధ్యక్షులు ఎల్కపల్లి స్వామి, ఓబీసి మోర్చా అధ్యక్షులు దుర్సెట్టి రమేష్, కిసాన్ మోర్చా నాయకులు బుర్ర శ్రీనివాస్, మధుకర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు