నల్గొండ జిల్లా, మార్చ్ 13 (జాగో న్యూస్): ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గా ఎన్నికైన నెల్లికంటి సత్యానికి బీసీ హక్కుల సాధన సమితి ఉమ్మడి నల్లగొండ జిల్లా బాధ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సత్కార కార్యక్రమానికి హాజరైన బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనంజయ నాయుడు మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యమాల కేంద్రమైన నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శి కి ఎమ్మెల్సీ గా అవకాశాన్ని పార్టీ కల్పించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ….. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమానికి ఊతం లభించినట్టు అయిందని పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వచ్చే సూచనలు కల్పిస్తున్నాయని, ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీకి శాసనమండలితో పాటు శాసనసభలో ప్రజా సమస్యలపై గళం వినిపించే అవకాశం ఇచ్చిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలో రానున్న స్థానిక సంస్థలో ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే దిశగా నాయకత్వం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వారిని ప్రజలు ఎన్నుకోవాలని గ్రామీణ ప్రాంతాలు సత్వరం అభివృద్ధి చెందాలంటే కమ్యూనిస్టులనే గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాదన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్లెం కృష్ణ రాష్ట్ర సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ ఉన్నారు.
