రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, మార్చ్ 16 (జాగో న్యూస్): అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ని ఉద్దేశపూర్వకంగా జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసిస్తూ ఆదివారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ కేటీఆర్ జగదీశ్వర్ రెడ్డిల దిష్టిబొమ్మలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ను అవమానించే విధంగా మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మల్యే తీరుపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
