కరీంనగర్/సైదాపూర్, మార్చి 16 (జాగో న్యూస్): వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం సొంత ఖర్చులతో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి (జెఎస్ఆర్) ఏర్పాటు చేసిన చలివేంద్ర కేంద్రాన్ని,బీజేపీ మండల మాజీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సింగిల్ విండో డైరెక్టర్లు ప్రవీణ్ రావు,తిరుపతి రెడ్డిలు రిబ్బన్ కట్ చేసి చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. వేసవి కాలంలో ప్రజలకు త్రాగు నీటిని అందించాలనే ఉద్దేశ్యంతో సురేందర్ రెడ్డి వరుసగా నాలుగవ సంవత్సరం చలి వేంద్రాలను ఏర్పాటు చేయడం సంతోషకరం అని,ప్రజలందరూ చలి వేంద్రాలను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నెల్లి శ్రీనివాస్,అశోక్,వీరన్న,నిర్ల సతీష్,శ్రీనివాస్, సాయి,ప్రవీణ్, దేవెందర్,తిరుపతి, అనిల్,సదానందం తదితరులు పాల్గొన్నారు.
