కరీంనగర్, ఏప్రిల్ 02 (జాగో న్యూస్): కురుమల ఆరాధ్య దైవం దొడ్డి కొమురయ్య 98వ జయంతిని పురస్కరించుకుని విద్యానగర్లో నిర్వహించబోయే దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలకు హాజరు కావాలని కోరుతూ..కమిటీ బాధ్యులు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు పుష్పగుచ్చాన్ని అందించి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు తొంటి రాజేందర్ కమిటీ బాధ్యులు బండారి శేఖర్, మ్యాకల సంజీవ్, ఎల్కపెల్లి రాజేష్, చిగుర్ల రాజు, కర్రే రాజేందర్, సంద సంతోష్, బొడపట్ల కుమార్, కంబల్ల సంజీవ్ లు ఉన్నారు.









