కరీంనగర్/సైదాపూర్, ఏప్రిల్ 03 (జాగో న్యూస్): మండల కేంద్రంలోని కేరళ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఓపెన్ హౌస్,గ్రాడ్యువేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్ఈఓ కొమ్మేర శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు సర్టిఫికెట్ లను అందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సతీష్ కుమార్, ప్రిన్సిపాల్ అనగోని తిరుపతి, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, బిఅర్ఎస్ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య, మాజీ సర్పంచ్ కొండా గణేష్, మాజీ ఎంపీటీసీ జంపాల సంతోష్, సింగిల్ విండో డైరెక్టర్ బొమ్మగాని రాజు, నాయకులు కూతురు విద్వాన్ రెడ్డి, గోపగోని నవీన్ కుమార్, బోనగిరి అనిల్, తిరుపతి నాయక్ తదితరులు వున్నారు.









