*అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాదయాత్ర ప్రారంభించిన సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి
కరీంనగర్, ఏప్రిల్ 03 (జాగో న్యూస్): జై బాపు, జై భీమ్, జై సంవిదాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కరీంనగర్ రేకుర్తి మెయిన్ రోడ్డులో గల అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమై 17,18,19,20,39 డివిజన్ల మీదుగా కొనసాగించి విద్యానగర్ వాటర్ ట్యాంక్ వద్ద ముగిసింది. ఈ సందర్భంగా పాదయాత్రను ఉద్దేశించి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన గాంధీ మహాత్ముడిప్రాధాన్యత తగ్గించే విధంగా బిజెపి ప్రవర్తిస్తుందని అదే విధంగా పార్లమెంట్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంబేడ్కర్ ను అవమానపరచే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు పన్నుతున్న వారికి వ్యతిరేకంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లోకి పాదయాత్ర ద్వారా వెళ్తున్నామని అన్నారు. ఈ పాదయాత్రలో కరీంనగర్ నియోజక వర్గ ఇంచార్జి పురుమల్ల శ్రీనివాస్, st సెల్ శ్రవణ్ నాయక్, sc సెల్ కొరివి అరుణ్ కుమార్,బాలబాద్రి శంకర్, జక్కుల మల్లేశం, బోనాల శ్రీనివాస్, ఎండీ చాంద్, బబ్లు వర్మ, నర్స గౌడ్, వరాల నర్సయ్య, అస్తపురం రమేష్, గన్ను మహేందర్ రెడ్డి, అస్తపురం తిరుమల, వెన్నం రజిత రెడ్డి, జూపాక సుదర్శన్, కాంపెల్లి కీర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు.









