అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ ఇంప్రూవ్మెంట్ చేయాలి

కరీంనగర్, ఏప్రిల్ 03 (జాగో న్యూస్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అధ్యక్షతన వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయ మీటింగ్ హాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర, పట్టణ ఆరోగ్య కేంద్ర, బస్తీ దావఖాన వైద్యాధికారులతో మరియు ఎం ఎల్ హెచ్ పి అందరితో అన్ని ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షాసమావేశం నిర్వహించనైనది. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకట రమణ ఆరోగ్య కార్యక్రమాలన్నింటినీ సబ్ సెంటర్ వారిగా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారీగా సమీక్షిస్తూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు ఇంప్రూవ్ చేయాలని మొదటి కాన్పులన్నీ నార్మల్ అయ్యేటట్టు చూడాలని గైనకాలజీ డాక్టర్ల సలహాలు కూడా తీసుకోవాలని జీరో ప్రభుత్వ డెలివరీ లు ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లను ఆదేశించారు. 30 సంవత్సరముల వయస్సు పైబడిన వారికి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ ఇంప్రూవ్ చేయాలని ఆదేశించారు. క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అందరూ వారి వారి క్షయ వ్యాధి నివారణలో వారి టార్గెట్ ను పూర్తిచేయాలని కోరారు. ఎన్ సి డి ప్రోగ్రాం ఆఫీసర్ విప్లవ శ్రీ మాట్లాడుతూ అభా కార్డు క్రియేషన్ కూడా 100% చేయాలని కోరారు. పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ సనజవేరియా మాట్లాడుతూ 100% 12 వారాల లోపు గర్భవతులందరినీ రిజిస్ట్రేషన్ చేయాలని 4 హాస్పిటల్ చెకప్ లు చేసి ప్రభుత్వ హాస్పిటల్ లో నార్మల్ డెలివరీ కొరకు వారిని మోటివేట్ చేయాలని కోరారు. డి ఐ ఓ డాక్టర్ సాజిదా మాట్లాడుతూ పిల్లల వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని 100% టార్గెట్ పూర్తి చేయాలని మరియు వచ్చే నెల నుంచి మిస్సింగ్ పిల్లల కొరకు నిర్దేశించిన మిషన్ ఇంద్రధనస్సు ప్రోగ్రాం ని పూర్తిగా విజయవంతం చేసి అందరికీ పూర్తి వ్యాధిని నిరోధక టీకాలు పూర్తిగా అందేలా చూడాలని కోరారు. ఈ సమీక్షా కార్యక్రమంలో డిటిసిఓ డాక్టర్ రవీందర్ రెడ్డి,డిఐఓ డాక్టర్ సాజిద, డిప్యూటి డిఎం హెచ్ ఓ డాక్టర్ చందు, పి ఓ ఎం సి హెచ్ డాక్టర్ సనజవేరియా , పిఓఎన్సిడి డాక్టర్ విప్లవ శ్రీ , డెమో రాజగోపాల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఎం ఎల్ హెచ్ పి డాక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు