కరీంనగర్, ఏప్రిల్ 03 (జాగో న్యూస్): తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 98వ జయంతి వేడుకలను కరీంనగర్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. అమరుడు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాటం చేసి అమరుడైన దొడ్డి కొమురయ్య భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్త్రం నీలాదేవి, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్, రాంబాబు నాయక్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.









