రాజన్న సిరిసిల్గ/తంగళ్ళపల్లి, జూన్ 01 (జాగో న్యూస్): బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆత్మకూరి చంటి కి ఆరు రోజుల క్రితం లాటిఛార్జ్ అయినా సందర్భంలో ఆదివారం ఎమ్మారై స్కానింగ్ రిపోర్ట్ లో చేతి మనికట్టు ఫ్రాక్చర్ కావడం జరిగింది. విషయం తెలిసిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ వారి ఇంటికి వెళ్లి పరామర్శించి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్యాక్స్ డైరెక్టర్ బండి దేవేందర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మోతే మహేష్ బిఆర్ఎస్ పార్టీ తంగళ్ళపల్లి పట్టణ అధ్యక్షుడు బండి జగన్ తంగళ్ళపల్లి మండల యూత్ నాయకులు బొడ్డు శ్రీధర్ పసుల అరవింద్ తదితరులు ఉన్నారు.
