ఘనంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు

కరీంనగర్, జోన్ 10 (జాగో న్యూస్): బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదినన్ను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ లోని వృద్ధుల ఆశ్రమంలో బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘాల నాయకులు జాజుల జన్మదినాన్ని పురస్కరించుకొని జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు వృద్ధులకు పండ్లు మరియు బ్రెడ్ పంపినిచేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్ తన పోరాటాలతో బీసీ విద్యార్థులకు బోధన రుసుము తోపాటు సంక్షేమ వసతి గృహాలు ఏర్పాటుకు కృషిచేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ కూలజన చేసేలా పోరాటం చేశారని అన్నారు. అలాగే జనాభా దామాషా ప్రకారం చట్ట సభల్లో బీసీల ప్రతినిత్యం కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. అందరి ఆదరాభిమానాలతో వారు నేడు నూరేళ్ళు జీవించి బీసీల హక్కులపై పోరాటం చేస్తూ చట్ట సభల్లో అడుగు పెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, జిల్లా ఉపాధ్యక్షులు కాయితోజు బ్రహ్మచారి, మంతెన కిరణ్,బీసీ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు సంజీవ్, కుసుంబ ఆదర్శ్ మరియు బీసీ సంక్షేమ అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు