కరీంనగర్, అక్టోబర్ 25 (జాగో న్యూస్): ఇటీవల నీట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఎంబిబిఎస్ అడ్మిషన్ సీటును సాధించిన కరీంనగర్ పట్టణానికి చెందిన సయ్యద్ రిజ్వాన్, ఆయిషా ఫాతిమా దంపతుల కుమార్తె సైదా ఖాతేజా ఫాతిమా నీట్ పరీక్షలో 415 మార్కులు సాధించి, సురభి మెడికల్ కాలేజీలో “ఏ” కేటగిరిలో సీట్ సాధించినందుకు టీడబ్ల్యూజేఏ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు టైగర్ అలీ నవాబ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సైదా ఖాతేజా ఫాతిమా ను ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఏ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు టైగర్ అలీ నవాబ్ మాట్లాడుతూ ఉన్నత లక్ష్యసాధనకు కృషి చేస్తూ తల్లిదండ్రుల, షహీన్ విద్యాసంస్థ ప్రిన్సిపాల్ ఆశయాలను నిలబెట్టాలని ఆకర్షించారు. తల్లిదండ్రుల, షాహిన్ విద్యాసంస్థ ప్రోత్సాహంతో మెడికల్ సీట్ సాధించినట్లు, భవిష్యత్తులో వైద్య వృత్తిలో స్థిరపడి పేద రోగులకు సేవ చేయనున్నట్లు సైదా ఖాతేజా ఫాతిమా తెలిపారు.








