రాజన్న సిరిసిల్ల,తంగళ్లపల్లి, అక్టోబర్ 27 (జాగో న్యూస్): తంగళ్లపెల్లి మండలం సిరిసిల్ల- సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారి పక్కన గల నేరెళ్ల గ్రామం హెచ్.పీ పెట్రోల్ బంక్ దగ్గర ఇట్టిరెడ్డి రాజిరెడ్డి రామచంద్రపుర్ గ్రామానికి చెందిన ఇంట్లో మధ్యాహ్న సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయం చూసి దొంగలు పడ్డారు. ఈ చోరీలో 40 గ్రాముల బంగారం డబ్బులు ఎత్తుకెళ్లడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించిన వెంటనే సంఘటన స్థలానికి ఎస్సై ఉపేంద్ర చారి, కానిస్టేబుల్ నరేందర్, సిబ్బంది పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు.








