కరీంనగర్, అక్టోబర్ 28 (జాగో న్యూస్): ప్రమాదకర పరిస్థితిల్లో అత్యంత అరుదైన “ఓ నెగటివ్” రక్తాన్ని గత 31 ఏళ్లుగా దానం చేస్తున్నానని, ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడడంతో పాటు నేటివరకు 67 సార్లు రక్తదానంతో పాటు ప్లేట్ లెట్స్, ప్లాస్మా దానం చేయడం జరిగిందని బీజేపీ నేత, న్యాయవాది బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల జిల్లా మల్యాల మండలం మ్యాడంపల్లి గ్రామానికి చెందిన గుర్రం ఆగయ్య (70 ఏళ్లు) అనే వ్యక్తి కరీంనగర్ లోని ఒక ప్రైవేట్ దవాఖానలో తీవ్రమైన గుండె నొప్పితో భాదపడుతూ చికిత్స నిమిత్తం అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించడంతో పేషెంట్ కు ఓ నెగటివ్ రక్తం అత్యవసరం కాగా నగరంలోని ఒక ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా పేషెంట్ బంధువులు బేతి మహేందర్ రెడ్డి ని ఫోన్ ద్వారా సంప్రదించగా వెంటనే వెళ్లి ఓ నెగటివ్ రక్తాన్ని దానం చేసి ప్రాణాలు కాపాడడం జరిగిందని మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ రక్తదానం చేయడం ద్వారా నేటివరకు 67 సార్లు ఓ నెగటివ్ రక్తాన్ని దానం చేయడం జరిగిందని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. రక్తదానం చేయడం ద్వారా రోగి ప్రాణాలు కాపాడడంతో పాటు వారి కుటుంబాన్ని కూడా రక్షించినవారమవుతామని, అలాగే రక్తదానం చేయడం ద్వారా మనకు కొత్త రక్తం రావడమే కాకుండా ఆరోగ్యoగా ఉంటామని, అందుకే ఎలాంటి భయాలు లేకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రతి ఒక్కరు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని ఈ సందర్బంగా బేతి మహేందర్ రెడ్డి కోరారు. రక్తదానం చేసిన బేతి మహేందర్ రెడ్డిని బీజేపీ శ్రేణులు, న్యాయవాదులు, 40వ డివిజన్ వాస్తవ్యులు, శ్రేయోభిలాషులు అభినందించారని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు.








