కరీంనగర్: తుఫాన్ నేపథ్యంల జిల్లాలో 2 రోజుల పాటు భారీ నుంచి కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని *కలెక్టర్ పమేలా సత్పతి* బుధవారం ఒక ప్రకటనలో కోరారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో అక్టోబర్ 29, 30 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. నీటి వనరులలో నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఎక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లావ్యాప్తంగా మత్స్యకారులు ఎవరు చేపలు పట్టడానికి వెళ్ళవద్దని సూచించారు. కల్వర్టులు దాటవద్దని, నీటి వనరుల సమీపంలో ప్రయాణాలు చేయవద్దని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అత్యవసమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.








