బీసీ కార్పొరేషన్ను పునరుద్ధరించాలి *దొగ్గలి శ్రీధర్ ప్రధాన కార్యదర్శి బీసీ సంక్షేమ సంఘం

కరీంనగర్: గత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ను బీసీ సంక్షేమ శాఖలో విలీనం చేసి కార్పొరేషన్ లో పనిచేసే ఉద్యోగులను బీసీ సంక్షేమ శాఖ కూ కేటాయించినారు ఇప్పటికీ అన్ని జిల్లాలలో బీసీ సంక్షేమ శాఖకు కేటాయించిన కార్పొరేషన్ ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యారు వారి స్థానంలో అర్హత కలిగిన బీసీ సంక్షేమ శాఖ జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్లు ఇచ్చి వారిని బీసీ కార్పొరేషన్ విధులు అప్ప చెప్పాలని అదేవిధంగా దానికి సంబంధించిన పనులను కొరకు ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించాలని బీసీ సంక్షేమ సంఘం పక్షాన కోరుతున్నాంకేవలం బీసీ కార్పొరేషన్ మాత్రమే బీసీ సంక్షేమ శాఖలో విలీనం చేశారు మిగతా కార్పొరేషన్లు యధావిధిగా పనిచేస్తున్నాయి జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు సంబంధించి బిసి కార్పొరేషన్ లేకపోవడం విచారకరం బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలను ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా కులాల వారిగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫెడరేషన్ల రిజిస్ట్రేషన్ వాటికి సంబంధించిన రుణాలు ఇవన్నీ కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా అమలవుతాయి ఇలాంటి పనులన్నీ బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులు చేయడంలో ఇబ్బంది అవుతుంది. దాని కొరకు బీసీ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న అరత కలిగిన జూనియర్ అసిస్టెంట్లకు ఇతర ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చి బీసీ కార్పొరేషన్ కేటాయించి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి బీసీ కార్పొరేషన్ పనులకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం పక్షాన కోరుతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రత్యేకమైన బీసీ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దీని కనుగుణంగా బీసీ కార్పొరేషన్ కు బీసీ సంక్షేమ శాఖల ఉన్న సిబ్బందికి ప్రమోషన్లు ఇచ్చి కార్పొరేషన్ వర్క్ లకు యధావిధిగా కొనసాగించే విధంగా ప్రభుత్వం చేయాలని బీసీ సంఘాల పక్షాన కోరుతున్నాం.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు