రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి, నవంబర్ 1న దళితులు హైదరాబాద్ కు రావాలని MRPS అధినేత, “పద్మ శ్రీ. మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు.. తంగళ్లపల్లి మండల కేంద్రంలో MRPS మండల అధ్యక్షులు సావనపెల్లి బాలయ్య మాదిగ ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR గవాయ్ ఫై జరిగిన దాడికి ఇప్పటికి కేసు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ నవంబర్ 1న హైదరాబాద్ లో నిర్వహిస్తున్న దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ కార్యక్రమానికి మండలములోని అన్ని గ్రామాల నుండి దళితులంతా తరలి రావాలని కోరారు. సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ స్థానంలో ఉన్న దళితుడికే రక్షణ లేకపోతే దేశంలో సామాన్య దళితులకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నినించారు. దళితుల ఆత్మ గౌరవం, ఆస్థిత్వాన్ని కాపాడుకోవడం చేపట్టే ర్యాలీకి పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని దళితుల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో MRPS జిల్లా కో కన్వీనర్ సావనపెల్లి రాకేష్ మాదిగ MRPS మండల ఉపాధ్యక్షులు చదల రాకేష్ మాదిగ, MRPS నాయకులు ఎడ్ల రవి, తుడుం నర్సయ్య, చదురుమల్ల మల్లయ్య, ఎడ్ల అరుణ్ కుమార్, మునిగే దేవరాజు, మల్లారపు నరేష్, అక్కనపెల్లి పోచమల్లు, చదల రాజశేఖర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.









