రాజన్న సిరిసిల్ల/తంగళ్ళపల్లి: భూసంస్కరణలు, రాజభరణాల రద్దు ,బ్యాంకుల జాతీయం ,హరిత విప్లవం లాంటి ఎన్నో విప్లమాత్మక నిర్ణయాలు ఇందిరా యే ఇండియాగా పరిపాలన చేసి ప్రజల మన్ననలు పొంది ,అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్షంలో భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టిన అత్యున్నత స్థానంలో నిలబెట్టిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా జలగం ప్రవీణ్ (టోనీ) అధ్వర్యంలో ఎర్రగడ్డ లోని 71 వ బూత్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ sc సెల్ విభాగం అధ్యక్షుడు అకునూరి బాలరాజు, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జి గడ్డం మధుకర్ (చోటు), AMC డైరెక్టర్లు అరపెల్లి బాలు, పొన్నాల పర్షరాములు, నర్సయ్య, అసరీ బాలరాజు, గుగ్గిళ్ళ భరత్, ఎడ్ల తిరుపతి, బాలసాని శ్రీనివాస్, గదరీ కిషన్, మీరలా శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.









