కరీంనగర్: సహకార రంగంలో కరీంనగర్ జిల్లాకు ఒక చరిత్ర ఉందని సహకార అర్బన్ బ్యాంక్ ను కూడా ఆ దిశగా నడిపించడానికి ఒక మంచి పాలక వర్గాన్ని ఎన్నుకోవాలని దానికి ప్రభుత్వపరంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 92 కోట్ల పైచిలుకు డిపాజిట్లతో దాదాపు 50 కోట్ల లోన్లతో నడుస్తున్న అర్బన్ బ్యాంకుకు గత ఎనిమిది సంవత్సరాలుగా పాలకవర్గం లేకపోవడానికి ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికలు జరిపి బ్యాంక్ అభివృద్ధికి కృషి చేయాలని అడ్డంకులన్నీ తొలగించి ఎన్నికలకు పోవడం జరిగిందని అన్నారు. ఎన్నికల్లో ఎక్కువ మంది అనుభవమున్న కాంగ్రెస్ నాయకులు పోటీ చేస్తున్నందున ప్యానల్ ప్రకటించలేదని సభ్యులు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకుని మంచి పాలకవర్గాన్ని ఎన్నుకోవాలని కోరారు.రాబోయే రోజుల్లో ఇంకా డిపాజిట్లు పెరిగేవిధంగా ఖాతా దారుల్లో విశ్వాసం నింపే విధంగా పనిచేసే పాలకవర్గాన్ని ఎన్నుకోవాలని అనుభవమున్న కాంగ్రెస్ నాయకులు పోటీలో ఉన్నారని గెలిచిన పాలకవర్గానికి ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. అర్బన్ బ్యాంక్ ఎంతోమంది ఖాతాదారులకు సేవలు అందించడమే కాకుండా లోన్ల ద్వారా మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు ఉపయోగపడుతుందని ఇప్పుడున్న 9 వేల మంది సభ్యులు పది కిలోమీటర్ల పరిధిలో గుర్తింపు కార్డు సమర్పించిన వారేనని వారందరూ ఎక్కువ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని నరేందర్ రెడ్డి కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో చర్ల పద్మ,దండి రవీందర్, బొబ్బిలి విక్టర్,ఎండి చంద్,షబానా మహమ్మద్, జ్యోతిరెడ్డి, హసీనా,అస్థాపురం రమేష్,శిల్ప తదితరులు పాల్గొన్నారు








