కరీంనగర్ రూరల్: కరీంనగర్ నగరంలోని బొమ్మకల్ ప్రాంతంలోని చెల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాల సమీపంలోని రాజరాజేశ్వర కాలనిలో…కాలని వాసుల అధ్వర్యంలో గత పదేళ్ల క్రితం ఏర్పాటు చేసుకున్న హనుమాన్ ఆలయానికి భక్తులు రాకుండా కొంతమంది భూ కబ్జాదారులు ఆలయ దారికి అడ్డంగా ఫెన్సింగ్ వేసారు . ఈ విషయాన్ని కాలని వాసులు ఎమ్మెల్యే గంగుల దృష్టి కి తీసుకెళ్లగా నేడు అక్కడి వారు స్వయంగా చేరుకొని ఫెన్సింగ్ ను తొలగించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల తో పాటు మాజీ కార్పొరేటర్లు వంగపల్లి రాజేందర్ రావు, దిండిగాల మహేష్, రాజా రాజేశ్వర కాలని అధ్యక్షులు గాండ్ల లక్ష్మీనారాయణ, కాలనీ వాసులు, కీర్తన, బొందవ్వ, అంజలి, స్వరాజ్యం, లక్ష్మీ ,సుగుణ, తదితర కాలని వాసులు పాల్గొన్నారు.









