స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జాప్యం. ప్రజల్లో తీవ్ర గందరగోళం. *సిపిఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి.

కరీంనగర్: ఉద్యమాలు,పోరాటాలు నిర్వహించి,అనేక మంది అమరవీరుల త్యాగాలతో పునీతమైన భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ 26వ తేదీ నాటికి వందేళ్లు నిండుతాయని, శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఊరురా వాడ వాడన సిపిఐ జెండాలు ఎగురవేస్తూ,పార్టీ నిర్వహించిన ప్రజోద్యమాలను యావన్మంది ప్రజానీకానికి వివరించాల్సిన అవశ్యకత సిపిఐ నాయకత్వంపై ఉందని సిపిఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యవర్గ,కౌన్సిల్ సభ్యుల సమావేశం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జిల్లా కార్యవర్గ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిదని జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26వ తేదీన భారత దేశంలో ఆవిర్భవించిన సిపిఐ వచ్చే డిసెంబర్ 26నాటికి వందేళ్లు నిండుతాయని,ఆ సందర్భంగా సిపిఐ నిర్వహించిన ఉద్యమ ఘట్టాలను,విజయాలను, మహోజ్వల చరిత్రను నేటితరానికి,ప్రతి గడపగడపకు వెళ్ళి తెలియజేయాలని,,అన్ని.శాఖల్లో ఎర్రజెండాలు ఎగురవేస్తూ,ర్యాలీలు,సభలు,సెమినార్లు నిర్వహిస్తూ, జనసేవాదళ్ క్యాంపులు నిర్వహించాలని,రాష్ట్ర పార్టీ వైపున నిర్వహించే జాతను జిల్లాల్లో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పూర్తిగా పెట్టుబడుదారులు కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వ ప్రజల సొమ్మును ధారా దత్తం చేస్తూ ప్రజాధనాన్ని మోడీ దుర్వినియోగం చేస్తున్నాడని, ఆదానీ,అంబానీలకు ఊడిగం చేస్తూ ప్రభుత్వం నుండి అనేక రాయితీలు ఇస్తున్నాడని, గతంలో 14 లక్షల కోట్ల రూపాయల రుణాలను పెట్టుబడిదారులకు మాఫీ చేశాడని ఈ మధ్యకాలంలో ఆదానికి ఎల్ఐసి నుండి రుణాలు ఇస్తూ ప్రజలు దాచుకున్న సొమ్మును ధనవంతులకు ధారా దత్తం చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు వాయిదాలు వేయడం మూలంగా ప్రజల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయని,ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని ప్రజల గందరగోళానికి తెరలేపాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ సిపిఐ వందేళ్ల ఉత్సవాలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తామని, డిసెంబర్ లో జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జాతా నిర్వహించి ప్రజల పక్షాన నిలిచి పోరాడేది సిపిఐ అని ప్రజలకు తెలియజేస్తామని, జిల్లాలో పార్టీని ప్రజాసంఘాలను బలోపేతం చేయడం కోసం నాయకత్వం కలిసికట్టుగా పనిచేయాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి,జిల్లా కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, బత్తుల బాబు,కసిరెడ్డి సురేందర్ రెడ్డి,నాగెల్లి లక్ష్మారెడ్డి,బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య తో పాటు జిల్లా కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు