కరీంనగర్: జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా జాతీయ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సయ్యద్ ఖాలీద్ పలువురు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నాయకులకు, కమిటీ సభ్యులకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా అదనపు ప్రచార బాధ్యతలు కేటాయిస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వీరిలో జిల్లాకు చెందిన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఆర్.టి.ఏ మెంబర్ పడాల రాహుల్ ఉన్నారు. ప్రచార కార్యకలాపాలను సజావుగా అమలు చేయడానికి నియమించబడిన ఈ కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు బి మహేష్ కుమార్ గౌడ్ సారథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత్రుత్వంలో, హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సమన్వయంతో సమిష్టి కృషితో పనిచేయాలని ఆదేశించినారు.

								
															
															






