రాజన్నసిరిసిల్ల, (జాగో న్యూస్): త్వరలో జరిగే మున్సిపల్ పురపోరుకు సిరిసిల్ల మున్సిపల్ 20వ వార్డు నుండి నల్ల శ్రవణ్ పోటీ చేయనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. 20వ వార్డులో గత తొమ్మిది సంవత్సరాలుగా గత బిఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల తరఫున ప్రశ్ని స్తూ అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతూ వార్డు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అర్హులైన వారికి మొదటి జాబితాలోనే ఇందిరమ్మ ఇళ్లను, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించేలా చర్యలు చేపట్టడంతో పాటు తన దృష్టికి వచ్చిన అనేక ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం ప్రజలను వెంటే ఉంటున్నాడు. ఒక నాయకుడిగా కాకుండా ప్రజలలో ఉంటూ సేవ చేస్తున్నానని వెల్లడిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రజల ఆశీర్వాదంతో 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పుర పోరులో పోటీలో నిలిచేందుకు ముందుకు వస్తున్నాను అని వార్డు ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ప్రభుత్వం లేనప్పుడు ప్రజల కోసం చేసిన కృషి మీకు తెలుసని, ఒకసారి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు అవకాశం ఇస్తే తాను ఏమిటో మరోసారి నిరూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అధికారం కోసం కాదని, ప్రజా సేవ చేయాలనే తపనతోనే ప్రజల ముందుకు వస్తున్నానని, వ్యక్తిగత లాభం కోసం కాదు, వార్డు అభివృద్ధి కొరకే నన్నారు. అధికారం కంటే ప్రజల ఆదరణనే తన బలమని ఆశాభావం వ్యక్తం చేశారు.మీ ఇంటి బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ ముందుకు వస్తున్నానని మనస్ఫూర్తిగా ఒకసారి అవకాశం ఇస్తూ ఆశీర్వదించగలరని కోరారు.








