కరీంనగర్,ఫిబ్రవరి04 (జాగో న్యూస్): తెలంగాణ జాగృతి మరియు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుండి పోటీ చేస్తున్న కార్పొరేషన్ అభ్యర్థులను గెలిపించాలని జాగృతి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ పరిధిలో లోని 52వ డివిజన్ నుండి తెలంగాణ జాగృతి మరియు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉప్పరి సంగీతతో పాటు 50 మంది బుధవారం జాగృతిలో చేరగా జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్ సిటీ పేరుమీద ఎంతో అవినీతి జరిగిందని కరీంనగర్ మూడు రాజకీయ పార్టీల కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని నగర పాలక సంస్థ కు వచ్చిన నిధులను దారి మళ్ళించి బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని దీనిపై ఏ ఒక్క పార్టీ రాజకీయ నాయకుడు మాట్లాడటం లేదని ప్రశ్నించే గొంతుకై కవితక్క నేతృత్వంలో సామాజిక తెలంగాణ లక్ష్యంగా, కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా, తెలంగాణ జాగృతి మరియు ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు సింహం గుర్తుతో కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల బరిలోకి నిలిచారని కరీంనగర్ ప్రజలు వారిని ఆశీర్వదించి సింహం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో వారిని గెలిపించి వారు కోరారు. కవితక్క నాయకత్వంలో జాగృతి ద్వారా కరీంనగర్ అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వెయ్యాలని గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకుడు చంటి శ్రీనివాస్, మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు అక్కం శివారణి, అధివాసి విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్ అదేవిధంగా జాగృతిలో చేరిన వారిలో లంక భవాని, లంక మనోజ్, ఉప్పరి మనీత్, ఎస్ కే బషీరా, రామగిరి అనవ్వ, అస్తపురం అంజలి, తాళ్ల హారిక, బుర్ర రాజు, గసికంటి సాయి వంశి, బొడ్డు పెళ్లి సాయి, కుమ్మరి సాయి కృష్ణ, పండురాల రాజు, మైసాని యశ్వంత్, కుక్క రవి, బత్తుల వివేక్, మంథని ప్రసాద్, ఎండి షరీఫ్, కౌరు కోటి తదితరులు పాల్గొన్నారు.








