పరీక్షల వేళ ఒత్తిళ్లకు లోనుకావొద్దు * టెన్త్ విద్యార్థినులతో ఎమ్మెల్యే కవ్వంపల్లి

కరీంనగర్/తిమ్మాపూర్, ఫిబ్రవరి 04 (జాగో న్యూస్): పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా పదో తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. బుధవారం మార్నింగ్ వాక్ కు వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు ఎల్ఎండీ కాలనీలో జడ్పీ హైస్కూల్ క్రీడా మైదానంలో విద్యార్థినులతో ముచ్చటించారు. పరీక్ష రాసేందుకు ప్రశాంతంగా వెళ్లాలని, ఆందోళన, ఒత్తిడులకు గురికావద్దన్నారు. కష్టపడి చదివే విద్యార్థులు పరీక్షలను ఇష్టంగా రాస్తారన్నారు. ఇప్పటికైనా పరీక్షలకు సిద్ధమయ్యేందుకు పట్టుదలతో చదవాలని ఆయన సూచించారు.పదవ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో వందశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. చదువుల్లో రాణిస్తూ భవిష్యత్తుల్లో మంచి ఉద్యోగాలు సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు