“గోపు”ను గెలిపిస్తే అంచనాలకు మించి అల్గునూరు అభివృద్ధి *ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి

కరీంనగర్/తిమ్మాపూర్, ఫిబ్రవరి 04 (జాగో న్యూస్): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 8వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి గోపు మల్లారెడ్డిని గెలిపిస్తే అల్గునూరు సమగ్ర అభివృద్ధికి పాటుపడతామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అల్గునూరులో మున్నూరు కాపులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 11వ తేదీ జరిగే ఎన్నికల పోలింగ్ లో చేతి గుర్తుకు ఓట్లేసి కాంగ్రెస్ అభ్యర్థి గోపు మల్లారెడ్డిని గెలిపించాలని కోరారు.ఎన్నికల్లో గోపు మల్లారెడ్డిని ఆశీర్వదిస్తే అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్నారు. ఇప్పటికే అల్గునూరులో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, ఇంకా చేపటాల్సిన వాటిని త్వరలో ప్రారంభిస్తామన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా కుల సంఘాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నదని చెప్పారు. అల్గునూరు అన్నా. అల్గునూరు గ్రామంపైన, ముఖ్యంగా అల్గునూరు ప్రజలపైన తనకు ప్రత్యేక అభిమానమని, కష్టకాలంలో తనకు వెన్నంటి ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేసి మరోమారు అభిమానాన్ని చాటుకున్నారు. తన మాదిరిగా స్థానికుడైన గోపు మల్లారెడ్డిని కూడా ఆదరించి అక్కున చేర్చుకోవాలని ఆయన కోరారు.గ్రామాభివృద్ధి విషయంలో ఎవరూ ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, ఎవరి అంచనాలకు అందని విధంగా అల్గునూరును అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామన్నారు. అన్ని కుల సంఘాలను అభివృద్ధి పర్చాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం పని చేస్తున్నదని కవ్వంపల్లి చెప్పారు. కుల సంఘాలకు ప్రభుత్వ స్థలాలు ఇవ్వడమే కాకుండా వాటి నిర్మాణాలకు నిధులు కూడా మంజూరు చేస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి వివరించారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు చెప్పే మాటలను నమ్మవద్దని, అన్నివర్గాల అభివృద్ధికి పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీనే ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి గోపు మల్లారెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షుడు తమ్మనవేణి రమేశ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ సల్ల రవీందర్, పార్టీ నాయకులు కంది లక్ష్మినారాయణ రెడ్డి, చిందం కిష్టయ్య, కంది అశోక్ రెడ్డి, దాసం నాగేందర్, జాప రాఘవ రెడ్డి, జేవీ మల్లారెడ్డి, మామిడి నరేందర్ రెడ్డి, సింగం శ్రీనివాస్, ప్రశాంత్ గౌడ్,ఎం.స్వాతి శ్రీకాంత్ గౌడ్, అట్ల అనిల్ కుమార్ ముదిరాజ్, తొర్తి అరవింద్ తోపాటు మున్నూరు కాపు సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు