కరీంనగర్ //గన్నేరువరం ఏప్రిల్ 17 (జాగో న్యూస్): శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలు మండల కేంద్రం గన్నేరువరంతో పాటు పలు గ్రామాలలో అంగరంగ వైభవంగా బుధవారం జరిగాయి. మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మార్కండేయ ఆలయాలలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణ నిర్వహణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. కాసింపేట మానసా దేవి ఆలయం, గునుకుల కొండాపూర్ ఆంజనేయ స్వామి ఆలయం, గుండ్లపల్లి సీతారాం ఆలయం, మైలారం గ్రామాలలో సీతారాముల కళ్యాణం ఆయా గ్రామాల కమిటీల ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. అధిక సంఖ్యలో హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కళ్యాణ నిర్వహణ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, మూసుకు ఉపేందర్ రెడ్డి, కొమ్మర రవీందర్ రెడ్డి, బొడ్డు సునీల్, చిటుకూరి అనంతరెడ్డీ, మాతంగి అనిల్, బుర్ర తిరుపతి గౌడ్, చింతల శ్రీధర్ రెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.









