కరీంనగర్/గన్నేరువరం, ఏప్రిల్ 17 (జాగో న్యూస్):: అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై గన్నేరువరం పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి చెందిన పల్లె సంతోష్ {29} కరీంనగర్ జిల్లా గన్నేరువరం నుండి రూ. 21,712 విలువ చేసే మద్యన్ని అక్రమంగా తరలిస్తుండడంతో మైలారం ఎక్స్ రోడ్ వద్ద గన్నేరువరం ఎస్సై నరేష్ పట్టుకున్నారు. మద్యన్ని స్వాధీనం చేసుకొని పల్లె సంతోష్ పై కేసు నమోదు చేశారు. అక్రమంగా మద్యం తరలించిన, బెల్టు దుకాణాలు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.









