కరీంనగర్, ఏప్రిల్ 18 (జాగో న్యూస్): భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ గుండాలు విద్యార్థులపై దాడులను నిరసిస్తూ ప్లే కార్డ్స్ తో మంకమ్మతోటలో నిరసన చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీలో విద్యార్థులపై ఎబివిపి గుండాలు దాడికి పాల్పడ్డారు. సుమారు 100 మంది మతోన్మాద మూకలు విద్యార్ధులపై దాడి చేశారు.గత రెండు రోజుల క్రితం పిడబ్యూడి విద్యార్ధిపై దాడి చేసిన ఎబివిపి చేయలేదని అబద్దాలు ప్రచారం చేసింది. ఎబివిపి అబద్ధాలను ఎస్ఎఫ్ఐ సాక్ష్యాలతో సహా నిరూపించింది, కావాలనే దివ్యాంగ విద్యార్ధిపై దాడి చేసిందని నిరుపించడంతో విద్యార్థులలో స్థానం కోల్పోయిన ఎబివిపి మళ్ళీ దాడికి ప్లాన్ చేసి అర్ధరాత్రి హస్టల్స్ దూరి దాడికి పాల్పడింది. దాడి చేయకుండా అడ్డుకున్న యూనియన్ అధ్యక్షుడు అతీక్, ఎస్ఎఫ్ఐ యూనిట్ కార్యదర్శి కృపాజార్జీ మరియు మరో 20 మంది విద్యార్ధులపై దారుణంగా భౌతిక దాడికి పాల్పడ్డారు. అమ్మాయిలను సైతం జుట్టు పట్టుకుని ఈడ్చి దాడిచేసి గాయపర్చారు. గాయాలపాలైన విద్యార్ధులను అంబులెన్స్ ద్వారా హెల్త్ సెంటర్ కు తరలిస్తుంటే అంబులెన్స్ హస్పిటల్ వెళ్ళకుండా అడ్డుకోని అంబులెన్స్ లోని వారిపై దాడికి పాల్పడలని ప్రయత్నం చేశారు. సెక్యూరిటి, ఇతర విద్యార్థులను సైతం భయబ్రాంతులకు గురిచేస్తూ దాడులు చేశారు. వారికి వారే గాయాలు చేసుకోని ఎస్ఎఫ్ఐ తమపై దాడి చేసిందని అబద్ధాలు నేరేట్ చేస్తున్నారు. ప్రశాంతంగా భిన్న అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హెచ్.సి.యు. క్యాంపస్ లో విద్వేషాలు, దాడులు చేసే సంస్కృతిని ఎబివిపి తీసుకుని వస్తుంది. వరుసగా క్యాంపస్ లో విద్యార్థుల నుండి తిరస్కరణ గురైతున్న ఎబివిపి ఎస్ఎఫ్ఐ పై దాడులు చేసి బెదిరింపులు గురిచేయాలనుకుంటుంది. అత్యంత నీచంగా మహీళ విద్యార్థులపై దాడి చేశారు. నిత్యం భారతమాత జై అంటున్న ఎబివిపి మహీళలపై దాడుల చేయడమేనా మహీళలకు ఇస్తున్న గౌవరం అని పశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రోహిత్, జిల్లా సహాయ కార్యదర్శి ఎల్కటూరి ఇశక్ నాయకులు రాకేష్, సద్నిత్ కుమార్ , రాక్షక్, శివ, గిరిచారన్, సతీష్, రాజు, శ్రీకాంత్, ఆదర్శ్, నరేష్, సాయితేజ తదితరులు పాల్గొన్నారు.









