MP బరిలో కరీంనగర్ భారతీయుడు * కరీంనగర్ లో మొట్ట మొదటి నామినేషన్

కరీంనగర్, ఏప్రిల్ 18 (జాగో న్యూస్: నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడుతూ, ఎర్ర మందుకు , పచ్చ నోటుకు అంతరించి పోతున్న నిజాయితీ “ఓటు” ని కాపాడడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రజలను, యువతి- యువకులను రాజకీయాలపై చైతన్య పరుస్తూ కరీంనగర్ భారతీయుడుగా పేరు తెచ్చుకున్న కోట శ్యామ్ కుమార్ కరీంనగర్ MP (ఇండిపెండెంట్) అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ ఒంటి నిండా విషం ఉన్న పాము కాటు వేసిన బ్రతుకు వచ్చు కానీ మద్యం మత్తులో, పైసల మాయలో బట్టల, బిర్యానీ ల మోజులో ఓటు వేస్తే మాత్రం బ్రతకడం కష్టం. అని ఆయన తెలియజేస్తూ ఓటు వేసే ముందు జనగణమన అని తలుచుకొని నీతిగా నిజాయితీగా ఓటు వేస్తూ ఈ సారి కరీంనగర్ MP గా తనను బారీ మెజారిటీ తో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు