కరీంనగర్, మే 20 (జాగో న్యూస్): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కే.వెంకటేశ్ ఆధ్వర్యంలో పట్టణంలోని బేడ బుడగ జంగాల కాలనీ లో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు, పాత ఇనుప సామాను రంగంలో పనిచేసే కార్మికులకు మరియు వివిధ ప్రదేశాల్లో కూలి పనులు చేస్తున్న వారికి కార్మిక చట్టాలు వర్తిస్థాయి అని తెలిపారు, ఇలాంటి అసంఘటితరంగాల లో పనిచేసే కార్మికులు, కూలీలు తప్పనిసరిగా స్థానిక కార్మిక అధికారి కార్యాలయంలో లేబర్ కార్డు కు దరఖాస్తు చేసుకోవాలని కార్మిక కార్డు ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు ప్రభుత్వం నుండి లభించే పథకాలకు అర్హులవుతారని తెలిపారు కార్మిక కార్డు ఉండటం వలన పిల్లల వివాహ సమయంలో, లేదా ప్రసవించినప్పుడు, దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి అంగవైకల్యం సంభవించిన, మరణించిన వివిధ ఆర్థిక సమస్యల పరిస్థితులలో ప్రభుత్వము కల్పించే స్కీముల ద్వారా ఆర్థిక లబ్ధి పొందవచ్చునని తెలిపారు, కార్మిక కార్డు గడువు ముగియకుండా ఉన్నప్పుడే పునరుద్ధరించు కోవాలని ఒకవేళ గడువు ముగిస్తే ఏ విధంగా పునరుద్ధరించుకోవాలో తెలిపారు, అలాగే ఏదైనా చెట్టు పరమైన సమస్య వచ్చినప్పుడు జిల్లాను ఆశీర్వాధికార సంస్థ ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఎలాంటి న్యాయపరమైన సహాయాన్ని అందించడానికైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కే.వెంకటేష్ తో పాటు, లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, మరియు కార్మికులు ఆశా వర్కర్లు, మహిళలు పాల్గొన్నారు.









