తప్పుడు ప్రచారాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు * సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్

కరీంనగర్, మే 20 (జాగో న్యూస్): ఎటువంటి కోతలు విధించకుండా ధాన్యం కొనుగోలు చేస్తుంటే ఉనికి చాటుకోవడానికి భాజపా నాయకులు డ్రామాలు చేస్తున్నారని సుడా చైర్మన్,నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ధ్వజమెత్తారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా వర్షాకాలం పంట నుండి బోనస్ ఇస్తామని చెప్పినప్పటికీ భాజపా రాద్దాంతం చేస్తుందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని అన్నారు.నల్లచెట్టాలు తీసుకువచ్చి రైతుల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తే వాటిని రద్దు చేయాలని రైతులు ఉద్యమం చేస్తే రైతులను కార్లు,గుర్రాలతో తొక్కించిన భాజపా నాయకులకు రైతుల గురించి మాట్లాడే కనీస అర్హత లేదని నరేందర్ రెడ్డి అన్నారు.కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు కల్లాలకు పోయి రైతులకు ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు మాట్లాడుతున్నారని బిఆర్ఎస్ ప్రభుత్వంలో క్వింటాలుకు అయిదు నుండి పది కిలోలు కోతలు విధించిన రోజు వీళ్ళు ఎక్కడున్నారని నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు.తప్పుడు ప్రచారాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని,రైతులపై రబ్బర్ బుల్లెట్ల తో దాడి చేసి గాయపరిచిన చరిత్ర భాజపా ప్రభుత్వంది అని నరేందర్ రెడ్డి అన్నారు.ఈ విలేఖరుల సమావేశంలో శ్రవణ్ నాయక్,ఎండి చాంద్,గుండాటి శ్రీనివాస్ రెడ్డి,వెంకట్ రెడ్డి,దండి రవీందర్,షబానా మహమ్మద్,జీడి రమేష్,మెతుకు కాంతయ్య,సతీష్ రావు,కూన దామోదర్, పొరండ్ల రమేష్,మేకల నర్సయ్య,మహమ్మద్ భారీ,జ్యోతి రెడ్డి,ఉప్పరి అజయ్,మాసుమ్ ఖాన్,మామిడి సత్యనారాయణ రెడ్డి,నాగుల సతీష్,తిరుమల,హసీనా, ఆంజనేయులు,సర్వర్, హనీఫ్,మామిడి సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు