భారతదేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసిన రాజీవ్ గాంధీ 

కరీంనగర్, మే 21 (జాగో న్యూస్): మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మంగళవారం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానకొండూరు శాసనసభ్యులు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పురుమల్ల శ్రీనివాస్తో పాటు పలువురు నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పరితపించిన మహానేత రాజీవ్ గాంధీ గారు, ఈ దేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసి అమెరికా లాంటి అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ఘనత ఆయనది. ఈ దేశంలో సాంకేతిక విద్యను అభ్యసించిన ఎన్నో వేల మంది విద్యార్థులు నేడు ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలలో స్థిరపడినారంటే అది నాటి రాజీవ్ గాంధీ ముందు చూపుకు నిదర్శనం అన్నారు. ఈ దేశ సమగ్రత కోసం ఐకమత్యం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 18 సంవత్సరాలు దాటిన యువతకు ఓటు హక్కు కల్పించిన రాజీవ్ గాంధీ పేరు ఈ విషయంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు నిలిచి ఉంటుందని వారు చేసిన సేవలను దేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని నేడు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు. అనంతరం పిసిసి కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో నగరంలోని రాజీవ్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిసిసి అధ్యక్షులు డాక్టర్.కవ్వంపల్లి సత్యనారాయణ గారితో పాటు పలువురు నాయకులు హాజరై రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కర్ర సత్య ప్రసన్న రెడ్డి, పులి ఆంజనేయులు గౌడ్, శ్రావణ్ నాయక్, మడుపు మోహన్, సిరాజు హుస్సేన్, ఆకారపు భాస్కర్ రెడ్డి, వెన్న రాజ మల్లయ్య, బొబ్బిలి విక్టర్, కల్వల రామ్ చందర్, ముస్తాక్, రామిడి రాజిరెడ్డి అమ్మద్ అలీ, పడిశెట్టి భూమయ్య, జనగామ సతీష్ రావు, వంగల విద్యాసాగర్, ఇమ్రాన్, బసవరాజ్ శంకర్, గంగుల దిలీప్, దిండిగాల మధు, మాదాసు శ్రీనివాస్, దీకొండ శేఖర్, బాల భద్ర శంకర్, నెల్లి నరేష్, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, చింతల కిషన్, జొన్నల రమేష్, కుంభాల రాజకుమార్, రూపు రెడ్డు శ్రీనివాసరెడ్డి, పోకల లక్ష్మీనారాయణ, బండ శకుంతల, అస్తపురం తిరుమల, మన్నే జ్యోతి రెడ్డి, కటకం కృష్ణ, హరీష్, వసీం, శిల్ప, సుంకర గణపతి, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు