రైతులను కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం మునగడ సాధించలేదు.. * బిజెపి పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు…

కరీంనగర్, మే 21 (జాగో న్యూస్): అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని బిజెపి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు డిమాండ్ చేశారు. రైతన్నల పరిష్కారం కోసం బిజెపి రణభేరి పేరిట సిరిసిల్లలో నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు మాట్లాడుతూ అతి తక్కువ వ్యవధిలో రైతన్నల వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుందన్నారు. రైతులను కన్నీరు పెట్టించిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించిన చరిత్ర లేదన్నారు. రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేస్తుండటంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పంటను కాపాడుకోవడానికి నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్న దయనీయ పరిస్థితి ఉందన్నారు. దీనికితోడు అకాల వర్షాల నుంచి పంటను కాపాడేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారన్నారు. పంటను రక్షించుకోవడానికి సరిపడ టార్ఫలిన్ కవర్లు అందుబాటులో ఉంచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.. తడుస్తున్న ధాన్యాన్ని తిరిగి అరబెట్టేందుకు రైతులు అనేకకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలైన దాఖలాలు లేవన్నారు. ముఖ్యంగా తాలు, తరుగు, తేమ పేరుతో క్వింటాలుకు 5 నుండి 10 కిలోలు కోత పెడుతూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా, పంటపై కోతలు కటింగ్లు విధిస్తూ, క్వింటాలుకు రూ.200 నుండి రూ.500 ల వరకు రైతులు నష్టపోయే పరిస్థితి తీసుకు వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఓ మాట అధికారంలోకి వచ్చాక ఓ మాట మాట్లాడుతుందని, రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూటకో మాట మాట్లాడుతుందని విమర్శించారు.క్వింటాలుకు రూ.500ల బోనస్ , రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా 15000, రైతు కూలీలకు ఇస్తామన్న 12 వేల హామీలు దిక్కు లేకుండా పోయిందన్నారు. ప్రధానంగా అన్ని రకాల పంటలకు బోనస్ అందిస్తామన్న కాంగ్రెస్ సర్కార్ నేడు సన్న వడ్లకే రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటన చేయడంతో , దొడ్డు రకం వడ్లను పండించిన అత్యధిక శాతం రైతులను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఈ అంశంలో రైతాంగానికి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే వడ్ల కొనుగోలు ప్రక్రియ సగానికిపైగా పూర్తయినందున కొనుగోలు చేసిన వడ్లకు సైతం సకాలంలో డబ్బులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే యాసంగిలో అకాల వర్షాలకు పలు ప్రాంతంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని,. బిజెపి క్షేత్రస్థాయి పర్యటనలో రైతులతో మాట్లాడుతున్నప్పుడు వరి, మొక్కజొన్న, మామిడి పంట లకు తీవ్ర నష్టం వాటిల్లందని,. నష్టపోయిన రైతులకు తక్షణమే రూ.10 వేల నష్టపరిహారం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నేటికీ పరిహారం అందనేలేదన్నారు.. ఒక్కో రైతు సగటున ఎకరానికి రూ.20 వేల పెట్టుబడి పెట్టారని,. కౌలు రైతులపై అదనంగా మరో రూ.10 వేల భారం పడిందన్నారు.,పంటల బీమా పథకాన్ని అమలు చేసి రైతన్నకు అండగా ఉండాలని, వారిని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని బీజేపీ పక్షాన కోరుతున్నామన్నారు. . లేనిపక్షంలో రైతులకు అండగా నిలబడి, వారి పక్షాన పెద్ద ఎత్తున నిరసనా కార్యక్రమాలు చేపడతామని బీజేపీ పక్షాన హెచ్చరిస్తున్నామన్నారు. ఈ దీక్ష కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్ట వెంకటేశ్వర రెడ్డి, పార్లమెంట్ కో- కన్వీనర్ ఆడేపు రవీందర్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ వీర్నపల్లి మండల అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు శ్రీధర్ రావు జిల్లా కార్యదర్శి బుగ్గ రెడ్డి, గజబింకర్ చందు, జిల్లా అధికార ప్రతినిధి భరకం నవీన్ యాదవ్, గుండెల్లి వేణు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనగంటి నరేష్, కొండ నరేష్, శ్రీనివాసరావు కిసాన్ మోర్చా అధ్యక్షుడు సుంకరి బాలకిషన్, పంపరి అర్జున్, కోడం శ్రీనివాస్, కోడం ఆనంద్ బాబు, బండారి వెంకటేశ్వర్లు, తాటిపాముల సత్యం, కాలీచరణ్, శ్రీనివాస్, వడ్నాల సత్యం, మరియు పార్టీ బూత్ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు