MP, MLA, MLC, ఎలక్షన్లు పూర్తి చేశారు ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్. * డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి

కరీంనగర్, మే 31 (జాగో న్యూస్): ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉత్సాహంగా నిర్వహించారు కానీ రాష్ట్రంలో వివిధ శాఖలు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ తక్షణమే భర్తీ చేయాలని డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జి తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక కొత్తపల్లి మండలంలో డివైఎఫ్ఐ సభ్యత్వ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం తిరుపతి మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక రాష్ట్రంలో దేశంలో నిరుద్యోగ యువత కుటుంబ పోషణ భారమై ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్లు నిధులు నియామకాల కొరకు 1126 మంది నిరుద్యోగ యువత ఆత్మబలిదారులు చేసుకుని స్వరాష్ట్రం సాధిస్తే గత పాలకులు వారి కుటుంబాలలో ఉద్యోగాలు భర్తీ చేసుకున్నారు కానీ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు భర్తీ చేయడంలో విఫలమయ్యారని ఆయన విమర్శించారు. నిరుద్యోగ భృతి అసెంబ్లీలో కేటాయించి నేటి వరకు నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం నిరుద్యోగ యువత హక్కులను గత పాలకులు కాలరాశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఉన్నత స్థాయి అధికారులు తక్షణమే వివిధ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఎలక్షన్లపై ఉన్నంత శ్రద్ధ ఉత్సాహం ఉద్యోగాలు భర్తీ చేయడంలో ఎందుకు లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశంలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మోడీ ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు భర్తీ చేయకుండానే పది వసంతాలు పూర్తిచేసుకుని ఎలక్షన్లపై ఉన్న ఉత్సాహం ఉద్యోగ భర్తీపై ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో వివిధ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఇన్చార్జి అధికారులతో పాలన కొనసాగడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా పాలకులు గత ప్రభుత్వం తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా వివిధ శాఖలో సుమారు లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి చెల్లించి జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ ఎస్టీ బ్యాగుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో నిరుద్యోగ యువతీ యువకులతో పెద్ద ఎత్తున ఆందో

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు