కరీంనగర్/గన్నేరువరం, జూన్ 2 (జాగో న్యూస్): గన్నేరువరం మండలంలోని మాదాపూర్ గ్రామ శివారులో ఆదివారం షార్ట్ సర్క్యూట్‌తో నిప్పు రవ్వలు పడి గడ్డి, పైపులు దగ్ధమయ్యాయి. రైతు సంపతి ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..మధ్యాహ్నం ట్రాన్స్ఫార్మర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ జరగడంతో నిప్పురవ్వలు చెలరేయి చుట్టుపక్కల వరి పొలాలకు వ్యాపించింది. రైతు సంపతి ఉదయ్ కుమార్ కు చెందిన వరి పొలాల్లో ఉన్న రూ. 10,000 విలువచేసే గడ్డి కట్టలు రూ. 10,000 విలువచేసే వ్యవసాయ పైపులు కాలిపోయాయి . మొత్తం 20,000 నష్టం వాటిల్లిందని రైతు సంపతి ఉదయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తమకు నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతు ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.









